Shubhakruth nama Ugadi Special Song 2022 | శుభకృత్ నామ సంవత్సర ఉగాది పాట 2022 | Make Lyrical Video

Ugadi commemorates the start of a new year. The name 'Ugadi' comes from two Sanskrit words -- 'Yuga' and 'Adi' -- which mean a new beginning.
On the first day of the new year, Ugadi, also known as Yugadi, is celebrated. It's mostly celebrated in Andhra Pradesh, Telangana and Karnataka.

Floral patterns on the floor and delicious food showcasing the regions' cuisines are the characteristics of Ugadi. On the first day of the month of Chaitra, Ugadi is celebrated.

Sri Shubhakruth Nama Samvatsara Ugadi Special Song Lyrics in Telugu

సాకీ:
యేడేడు గుర్రాల ఒంటి సెక్కర తేరు
యెక్కేసి సూరీడే యెచ్చంగ సేరిండే
శిశిరాల శిరసొంచి శశివంటి శిశువల్లే
పసిరేకు మెరిసిందే వాసంతమొచ్చిందే

కోరస్:
తెలవారి మన పల్లె సుందరం
చిరుగంట పలికింది గోపురం
అరకంట ఉలికింది పావురం
ఎలపెద్దు దులిపింది మూపురం
పలుపుతాడు వీగ
పొరమారంగ తాగ
ఉరికిందిలే లేగ అంబరం...
రావి చెట్టు అరుగు
చిన్నా పెద్దా కొలువు
జరగాలి ఉగాది సంబరం.

పల్లవి:
కిల కిల కోయిల సడిలా
పులకింతల నవ్వుల జడిలా
తొలిపండగిలా తరలొచ్చెనిలా
తెలుగిళ్లకు ఈ వేళ...
గడపల పసుపుల తడిలా
పలు మమతలు కట్టిన గుడిలా
శుభ సూచనలా ఎదురేగెనిలా
వాకిళ్లకు ఈ హేల...
వసంతమే తన పల్లకి కాగా
ఉగాదిలా దిగి వచ్చెనుగా
ఇలా ఇలా ఎద పున్నమి కాగా
సంతోషమే తను తెచ్చెనుగా...

కోరస్:
ఇలాంటి వేళ మరింక రాదు
అనేంత సందడిది...
కలా ఇదంతా అనే కళంతా
ఉగాది చూపినది...

చరణం:
శుభ కృత్తు అని పంచాంగాన్ని విని
మంచే జరుగునని ఆశే నింపుకొని
పిల్లల పెద్దల సందడి చూస్తే
కళ్లే చాలవుగా....
మహా కాంతి చేరినట్టు
చుట్టూ కొత్త పంచెకట్టు
మరో పక్క చీర కట్టు
బృందం తోటి రావిచెట్టు
ఆనందాల పుట్టినిల్లై మారే తీపి వేడుక
ప్రతీ గుండె కోయిలల్లే పాడే కొత్త గీతిక

కోరస్:
అనేకమైన రకాల రుచులు
కలిస్తె బతుకు అని
అనంతమైన సందేశముంది
ఉగాది పచ్చడితో

చరణం:
విష్ణు నామమున మహా పర్వమిది
సృష్టే జరుగుటకు ఆది కాలమిది
ఆ శ్రీశైలము కాళేశ్వరము
ద్రాక్షారామముల మధ్యస్థం త్రిలింగ దేశం
అదే తెలుగు జాతి బీజం
ఉగాదంటి సాంప్రదాయం
కదా మనకు వారసత్వం....
ఫలిస్తుంది కొత్త కార్యం ఉగాదిలో చేయగా
ఇదే మాట సత్యమవగా తథాస్తంది పండుగ

కోరస్:
ఛైత్రాన శుక్ల పక్షాన వచ్చే
శుభాల పాడ్యమిలో
ఉషోదయాన వసంతవేళ
ఉగాది వెలుగిదిగో....

శుభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు

Have you ever wondered about how to make a lyrical video or lyrical photo with your photo or your loved ones. .?
Do not worry you are in the right place, Make Lyrical Video will help you to make an attention grabbing lyrical video within few seconds with Ugadhi Song 2022 lyrics. Search for your favourite song lyrics scroll to the bottom of the lyrics click on **Upload Your Photo Here** upload a photo.. Boom... Your Portrait photo with lyrics is ready.. Click on Download icon and share it with your loved ones. Share Photo and Song lyrics on Whatsapp status, Facebook status, Twitter and Pinterest with one click.
Say Bye Bye to Selecting whole text to have your favourite song Lyrics, Just click on *Copy Lyrics* or Download Ugadhi Song 2022 lyrics as a pdf with one click.
Do you wanna generate a Lyrical Photo/Lyrical Video with this Lyrics. Click on *Upload Your Photo*
Lyrical Photo Portrait
_

If You want Your favorite song Please let me know

Post a Comment

If You want Your favorite song Please let me know

Post a Comment (0)

Previous Post Next Post

Contact Form